Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం.రేకు: 08-3 పాడి సం: 10-044

పల్లవి:

ఆతఁ డేమి దవ్వుగాఁడు అతివ ప్రాణనాథుఁడె
నీతితోడ వానిఁ గూర్చి నెలఁతఁ గావఁగదరే

చ. 1:

చల్లనైన గాలిచేత జాలిరేఁచె వలపు
పిల్లఁగోవి వట్టె వాఁడు పెచ్చురేఁచెనే
పొల్లవోని పూవులపప్పొడి పోదిసేసెనే
వొల్లనన్నఁ బోదు దీని కోమరమ్మ చెలులు

చ. 2:

రవ్వలైన వెన్నెలల రాఁపాయ మోహము
నవ్వి నవ్వి వాని చూపు నామురేఁచెనే
కొవ్వినట్టి కోవిలలకూఁతచేఁత గనమాయ
యెవ్వ రేమి సేతు రిఁక యెదరమ్మ దీనిని

చ. 3:

మదను పూవుటమ్ము సోఁకి మదము రేఁగె ప్రేమము
కదిసి విభుఁడు మోము చూపి కళలు రేఁచెనే
యిదివో శ్రీవెంకటనాథుఁ డింతి నిట్టె కూడినాఁడు
చెదరనట్టి వేడుకెల్ల చెందెనమ్మ యింతికి