Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 08-2 శంకరాభరణం సం: 10-043

పల్లవి:

ఎంచి మీచుట్టరికము లిందులో దెలుసుఁగా
మించి నడచితి రైన మీకు మీ యాన

చ. 1:

యేలా చల్లనిగాలి యింతి నేఁచ నేఁటికి
జాలి రేఁచితైన నీకు చందన మాన
మేలిమి తుమ్మిదలాల మెలుఁత వోరువ లేదు
కోలుముందై కూసిన మీకులము నాన

చ. 2:

మదనుఁడా చెలిమీఁద మానవయ్య కోపము
పదరితి వైన పంచబాణము లాన
పొదలినా చందమామ పున్నమవెన్నెల గాసి
కదిసి యెంచితి వైన కలువ లాన

చ. 3:

చక్కని కోవిలలాల జవరా లోపఁగ లేదు
చిక్కని కూఁత రేఁచితే చిగురు లాన
గక్కన నింతిని శ్రీవెంకటనాథుఁడు గూడె
మక్కువ నిందరికిని మానితి నాన