పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0316-6 శంకరాభరణం సంపుటం: 11-096

పల్లవి: ఇంగితాకారము లెత్త నెరిఁగినవాఁడవు
         సంగ తాయఁ బను లెల్ల జయవెట్టే మయ్యా

చ. 1: చెలియభారము నీది సిగ్గులు నీ చేతివి
       పలువిన్నపము లిఁకఁ బని లే దయ్యా
       అలరినే మాడేమాట లన్నియు నీ వాడితివి
       చలువాయ మా మనసు సారె మెక్కే మయ్యా

చ. 2: వనితపాలిటి దిద వహించుకో కిఁకఁ బోదు
       అనఁగి పెనఁగ నోతో నంత యేలయ్యా
       ననుపు లెల్లా నెరపి నమ్మిక నీ విచ్చితివి
       తనిసితి మిఁక నీ చేఁతలకు లో నయ్యా

చ. 3: కోమలి మన్నన నీది కోరికె లెల్లా నీవి
       వేమరు మండాటాల వింత లే లయ్యా
       కామించి శ్రీవెంకటేశ కలసితివి యింతిని
       ఆముకొంటి మిఁక నిన్ను నట్టె మెచ్చే మయ్యా