పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0317-1 శంకరాభరణం సంపుటం: 11-097

పల్లవి: అతివ నిన్నే మనిన నది యెగ్గా
         చతురు లైనవారికి చవులే కాదా

చ. 1: కూరిమి గొసరఁగాను కోపముగాఁ జేసుకొంటే
       యిరీతిఁ జెలుల కెల్లా నేది గతి
       మేర మీరే నవ్వులకే మిక్కిలి బీరా లాడీతే
       తారుకాణమోహలకు తగులాయ మేది

చ. 2: చనవు మెరయ రాఁగా సారెకువేసారుకొంటే
       వినయపుసతు లెల్ల వేగించు టెట్టు
       కనుఁగొనలఁ జూడఁగ కాఁతాళాలు నెరపితే
       ననుపుల లోపలికి నయగారా లేవి

చ. 3: కుచ్చి కాఁగిలించుకోఁగా కుచములు నాటె నంటే
        ముచ్చటాడేయింతులకు మొదలేది
        యిచ్చికుఁడ శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
        విచ్చనవిళ్లలోన విన్నవించ నేది