పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0316-5 నాదరామక్రియ సంపుటం: 11-095

పల్లవి: ఎడమాట లిఁక నేల యెదురుచూపు లేల
         తడ వాయ నిన్నిటాను తా నెరుంగానే

చ. 1: మొగము చూచినఁ గాని ముచ్చటలు వాయవు
       నగుతా నుండినఁ గాన ననుపు లేదు
       తగులాయ మైనఁ గాని తమకము వొడమదు
       వగ దీర నాతనివద్ద నుండవే

చ. 2: కందుల లంటినఁ గాని కరఁగవు మర్మములు
       మందెమేళ మైనఁ గాని మాఁట లెక్కవు
       చెంది చెనకినఁ గాని చిత్తము తనవి లేదు
       విందువలె నిఁక వేరె విన్నప మేలే

చ. 3: చెక్కులు నొక్కినఁ గాని చేతులకసి దీరదు
        వొక్కచో నుండినఁ గాని వొద్దికగాదు
        యిక్కు పెరిగి శ్రీవెంకటేశుఁ డిట్టె నన్ను గూడె
        చక్క నాయఁ బను లెల్ల జాణ తా నవునే