పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0316-3 సామంతం సంపుటం: 11-093

పల్లవి: కాకిబెగడశీరను కాశ వోసినాడు తాను
         వాకిటికి వాచ్చినాఁడు వలశితి ననవే

చ. 1: పచ్చనిసాపమీఁదఁ బవళించు మనవే
       కుచ్చి మాసూపులు దన్ను గురి దాఁకెను
       చెచ్చెరఁ బారుటాకుల చెంచవార మనవే
       తెచ్చేను మా దొండపంటితేనె లిదే అనవే

చ. 2: కొండపడ మేడలలోఁ గూరుసుండు మనవే
       నిండునెమలిగరులు నెత్తి కెక్కెను
       దిండు మా వెలఁగపండ్లు తీపు లెక్కె ననవే
       అండనె వుందాన తన కప్పగించే ననవే

చ. 3: కొప్పుల మొలల సే కుప్పవడె ననవే
       కప్పురపు తనతమ్మ కార మనవే
       వొప్పుగా శ్రీవెంకటేశుఁ డొనగూడె ననవే
       ముప్పిరి నేమీ నెఱఁగ మొక్కితి నే ననవే