పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0316-2 ముఖారి సంపుటం: 11-092

పల్లవి: నయ మిచ్చి మాటలాడ నావంటిదా ఆపె
          ప్రియముల బిగువులఁ బెనఁగెడుఁ గాక

చ. 1: గుట్టు దెలిసిన దాపె గొసరునా నిన్ను మరి
       వట్టి సణఁగులు చల్లి వంచుఁ గాక
       ఱట్టడి మొదలనె యాఱడి కింక లోఁగీనా
       తిట్టులును దీవెనలు దిగఁబోసుఁ గాక

చ. 2: యింతచనవుల దాపె యిచ్చకము లాడీనా
       పంతములనె నిన్నుఁ బంగించుఁ గాక
       అంతేసి నేరిచినాపె అప్పణ నిన్నడిగీనా
       వంతుల వాసులను మోవఁగఁ గూడుఁ గాక

చ. 3: మందెమేళముల దాపె మట్టున నుండునా నిన్నుఁ
       గిందుపరచి తాఁ గరఁగించుఁ గాక
       పొందితి శ్రీవెంకటేశ పొంచి నన్ను నిఁక నాపె
       చందాలను చాయలను సమ్మతించుఁ గాక