పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0315-6 లలిత సంపుటం: 11-090

పల్లవి: మమ్ము నిన్నిటా నిఁక మన్నించుఁ గాక
         చిమ్ముసిగ్గులఁ దడవు సేయ నేఁటికే

చ. 1: వలపించుకొన్నవాఁడు వాకిటికె వచ్చుఁ గాక
       పిలిపించుకొన నేలె పెనఁగ నేలె
       చలి వాసినట్టివాఁడు సరసము లాడుఁ గాక
       యెలయించి యెడమాఁట లిఁక నేఁటికే

చ. 2: చేసుకొన్న యట్టివాఁడు చెప్పినట్టె నేసుఁ గాక
       మూసి దాఁపిరము లేలె మొరఁగు లేలె
       ఆసపడినట్టివాఁడు అండనె కూచుండుఁగాక
       వోసరించి మరి కొన్ని వొడఁబా ట్లేఁటికే

చ. 3: చేయి చాఁచినట్టివాఁడు చెనకి కలసుఁగాక
        నాయముల వెట్ట నేలె నలన లేలె
        యీయెడ శ్రీవెంకటశుఁ డేకమై కూడినవాఁడు
        చాయలకు లోలోనిసన్న లిఁక నేఁటికే