పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0315-5 వరాళి సంపుటం: 11-089

పల్లవి: ఎట్టు సేసిన నాతని నేమీ ననకురమ్మ
         గుట్టు సేసు కుండితేను గుణవంతుఁ డౌనె

చ. 1: మచ్చరించఁ బని లేదు మాపుదాఁకా బతితోడ
       పచ్చి దేర నవ్వితేనె పంత మాడటా
       యెచ్చుకుందు లేమి గల్ల నిచ్చగించి గక్కునను
       కొచ్చి కౌఁగిలించుకొంటె గుణవంతుఁడౌనె

చ. 2: వెంగె మాడఁ బని లేదు వేవేలైనా నాతని
        సంగడిఁ గూచుండితేనె సాధించుటా
        సంగతి దప్పినవేళ సరసుని రతులకు
        కొంగు పట్టి తీసితేను గుణవంతుఁడౌనె

చ. 3: బాస గొనఁ బని లేదు పైకొని కాఁగిటిలోనె
        సేసవెట్టి కూడితేనె చిక్కించుటా
        యీసు దీర శ్రీవెంకటేశుఁ గలసితి విఁక
        గోసనాస గొనంకుంటె గుణవంతుఁడౌనె