పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0315-4 సామంతం సంపుటం: 11-088

పల్లవి: కంటే సుంకము మరి కానకుంటే బింకము
         యింటికాఁడ మాతో మాయ లేల సేసే విఁకను

చ. 1: కప్పి యాపె తనచేతికానుక నీ కియ్యఁగాను
       ముప్పిరి నీ వప్పటి నా మోము చూచేవు
       అప్పణ గొంటివా గోపాంగనల కెల్లఁ దొల్లి
       యిప్పుడు నాతో మాయ లేల సేసే విఁకను

చ. 2: పరగి యాపె నీకుఁ బనులు సేయ రాఁగాను
        సరి నాకుఁ జేయు మంటా సన్న సేసేవు
        పొరుగు పొరచిగా నీ పొలఁతులకుఁ జేయించు
        యిరవు నాతో మాయ లేల సేసే విఁకను

చ. 3: కందువ నాపె నిన్నుఁ గాఁగిలించుకోఁగాను
        అంది నన్నుఁ గాఁగిలించి తందులోననె
       పొందుమా శ్రీవెంకటేశ భూసతి శ్రీసతి నిట్టె
       యిందులోనె నాతో మాయ లేల సేసే విఁకయ