పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0302-2 సామంతం సంపుటం: 11-008

పల్లవి: ఓర్చుక నావద్ద నున్నాఁడవు
         తేర్చి నాగుణము తెలిసితివా

చ. 1: నెలఁత నీకు నటు-నేర్పిననేర్పుల
       మలకలమాటలు మఱచితివా
       పలుకవు మాతోఁ బలుమారు నవ్వేవు
       కెలయ కిందుకనె గెలిచేవా

చ. 2: వనిత నీకు నటు వంతులు వెట్టిన
       మనసులో పనులు మణచితివా
       పెనఁగక నాతో బ్రియములు చూపేవు
       ననుపు లిందుననె నడపేవా

చ. 3: కాంత నీవు ననుఁ గలయు మనిన యల
       మంతనపురతులు మఱచితివా
       యింతట శ్రీవెంకటేశ్వర ననుఁ గూడితి
       సంతత మిట్లనె జరుపేవా