పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0302-3 శుద్దవసంతం సంపుటం: 11-009

పల్లవి: అందాఁకా నీకు మొక్కుతా నంతా నింతా నుండేఁ గాక
         యిందరిలోఁ బదరితే నిది సిగ్గు గాదా

చ. 1: ఆవల నీ వొకతెతో అట్టె మాటలాడఁగాను
       చేపట్టి తియ్యగ బోతే సిగ్గు గాదా
       వావిరి నాపెయు నీవు వసంతము లాడఁగాను
       యీ వేళ నీ మోము చూచి దిది సిగ్గు గాదా

చ. 2: కోరటు పరాకై నీవు కొమ్మను గూడుండగాను
        చేరి నీతో నవ్వఁబోతే సిగ్గు గాదా
        గారవించి యాపెతోయాకతము నీ వాడఁగాను
        యీరీతి దగ్గరితేను యిది సిగ్గు గాదా

చ. 3: అక్కడిరతుల నీవు అలసి వుండేవేళ
        చెక్కులు నే నొక్కితేను సిగ్గు గాదా
        గక్కన శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
        యిక్కడ నవి దడవే దిది సిగ్గు గాదా