పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0315-1 భైరవి సంపుటం: 11-085

పల్లవి: సకలాపరాధము శమియించుకోవయ్య
         అకలంక మైననీ యానతిలో దానను

చ. 1: చేరి నీ పాదములకు సేవ సేసే నంటినా
       నేరుపులు నీ వెరంగనివి లేవు
       యేరీతి నైనాను చేయెత్తి మొక్కే నంటినా
       కారాణాలు నీ విన్నీఁ గాననవి గావు

చ. 2: మన సిచ్చి నోతోను మాట లాడే నంటినా
        వెనక ముందర నీకు వింత గాదు
        చనవు మెరసి నీసరుస నుండే నంటినా
        వినికిగా నీవు తొల్లి విననిది గాదు

చ. 3: గక్కనఁ గాఁగిట నిన్ను గరఁగించే నంటినా
       యిక్కువల నీకు నిది యెరవు గాదు
       చిక్కి నన్నుఁ గూడితివి శ్రీవెంకటేశ్వర నేఁడు
       పెక్కుసుద్దు లెల్ల నీకు భేదము గాదూ