పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0314-6 ఆహిరి సంపుటం: 11-084

పల్లవి: చెలులము మా కెప్పుడు సిగ్గె మేలు
         సొలసి నిన్నుఁ గన్నుల జూచుటే మేలు

చ. 1: మంచిమాట లాడినాను మర్మములు సోఁకీ నిన్ను
       యించుక గుట్టున నుండే దిదె మేలు
       అంచెల నీ వాన తీఁగా అట్టె విని చొక్కుకొంటా
       వుంచముతో సారె సారె నూఁకొనుటె మేలు

చ. 2: వూడిగాలు సేసినాను వోరసిన ట్లయ్యీని
       వోడక కొలిచి నిలచుండుటె మేలు
       వేడుక నీవు చేయి వేయఁగా బొగడుకంటా
       వాడికెతోడ నీకుఁ గైవస మౌటె మేలు

చ. 3: చేయి పట్టి తీసితేను సేవలు గొన్న ట్టయ్యీని
        చాయల నీదాన ననేసలిగె మేల
        యీయెడ శ్రీవెంకటేశ యింతలో నన్నుఁ గూడితి
        పాయక యిట్ల నుండేభాగ్యమె మేలు