పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0314-5 వరాళి సంపుటం: 11-083

పల్లవి: చూచినవారికి జూడ పోద్యా లివి
         యేచినవేడుకె కాని యెంతైనా వీఁగదూ

చ. 1: యెట్టు నమ్మెనో నీ చిత్త మింతి యెవ్వరు చెప్పిన
       జట్టిగొన నవ్వుఁ గాని చంచలించదు
       మట్టు లేని నీ వెంతమాట పట్టిచ్చితివో
       గుట్టుతోనే మెచ్చుఁ గాని కొంతైన వెరవదూ

చ. 2: కలికి నీ నిజ మెట్టు గనెనో నీ సుద్దులకు
       చెలరేఁగె వుండుఁ గాని చిన్నఁబోదు
       చెలిమి నీ వాపె కెంత చేతికి లో నైతివో
       వలపులె చల్లుఁ గాని వసివాడదూ

చ. 3: నీ మర్మ మె ట్టెఱిఁగెనో నెలఁత నీరతులకు
        వేమారుఁ బైకొనుఁ గాని వేసారదు
        నేమపు శ్రీవెంకటేశ నీ వెంత చొక్కించితివో
        ఆమనిభోగమె కాని ఆలయి కెరఁగదు