పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0314-2 దేసాళం సంపుటం: 11-080

పల్లవి: ముందటికి వెనకకు మొక్కేము నీకు
         కందువ లన్నియు నీవె కనుకొమ్మీ యిఁకను

చ. 1: యిచ్చక మాడితి నేఁడు యింటికి నీవు రాఁగాను
       కొచ్చి నిన్న రాకుండఁగఁ గొసరితిని
       బచ్చెన వేఁడివలపు పచ్చి దోఁచి చిగురాయ
       తచ్చి తొల్లిటియలుక తలఁచకు మిఁకను

చ. 2: కమ్మి నీవు చూడఁగాను కాను కిచ్చితి విప్పుడు
       తమ్మిని వేసితిఁ దొల్లి తల వంచఁగా
       వుమ్మగిలి నాసరస మొగ రెక్కి నిండఁ బూచె
       దిమ్ము రేఁగినచలము తిప్పుకోకు మిఁకను

చ. 3: గక్కన నీవు గూడఁగ గాఁగిలించుకొంటి నిట్టె
       మెక్కలాన నల్లప్పుడు మొరఁగితిని
       చిక్కన య్యనును నాయఁ జిత్తము శ్రీవెంకటేశ
       నిక్కి నీకపటములు నెరపకు మిఁకను