పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0314-1 రీతిగౌళ సంపుటం: 11-079

పల్లవి: చాయ సేసుకొనుఁ గాక సతుల యడాటాన
         పాయపు రమణఁడైతే పంతము గొనీనా

చ. 1: చెక్కు నొక్కి సేద దేర్చి సేవలు సేసితిని
       యెక్కువ తక్కువ లెల్లా నిఁక నేడవే
       గక్కన మీరు చెప్పఁగా గాని మ్మంటి మీమాట
       అక్కడనె నిలుచున్నాఁ డప్పటిఁదా నేఁటిదే

చ. 2: కొంకు వాయఁ గాఁగిలించి కూరిమి నవ్వు నవ్వి
        యింకఁ జెమరించితిని యిఁక నేఁటిదే
        మంకుదాన ననే రంటా మారుమాటలాడ మీకు
        బింకము లింగా మానఁడు పెనఁగనే వలెనా

చ. 3: మోవి యిచ్చి మొక్కు మొక్కు మోహ మెల్లా జల్లితి
        యీవల వట్టిగుట్లు యిఁక నేఁటికే
        మే వెంచి శ్రీవెంకటేశు మీ మొకమోటఁ గూడితి
        నావాఁడనె అనీఁ దాను నమ్మికలు వలెనా