పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0313-6 పాడి సంపుటం: 11-078

పల్లవి: ఆపెమారు విన్నవించే నదివో నేను
         చేపట్టిన నీచేతివే సేసెటిపనులు

చ. 1: ఆంగన నీ మాటలకు నాయములు గరఁగెను
       పొంగుచునుఁ జెమరించెఁ బులకించెను
       చెంగటి సిగ్గుతోడఁ జేరి నీతో మాటాడదు
       యింగితాన నీ చేతివే యిటమీఁదిపనులు

చ. 2: నీవు చే చాఁచినందుకె నివ్వెరగులఁ బొందెను
       భావము యింత మందె పచ్చి దేరెను
       తావుల కోరికల సందడిఁ బడి వున్న దదె
       యేవిధాన నీ చేతివే యిటమీఁదిపనులు

చ. 3: ఆడెటి నీ సరసాన కంతరంగము దనిసె
        వీడె మందుకొన నిన్నీ వేళఁ గూడెను
        జోడై శ్రీవెంకటేశ చొక్కులనె వోలవాడి
        యేడ నయీనా నీ చేతివే యిటమీఁదిపనులూ