పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0313-2 గౌళ సంపుటం: 11-074

పల్లవి: ఏమే సంగ తెరఁగ వింతిరో నీవు
         ఆమె కులువ చరించ కయ్యో నీవు

చ. 1: సంకె లేక యాతఁడు జాణఁడై తిరుగఁగాను
       అంకెలకు వంక లొత్తే వప్పటినీవు
       మంకుదానఁ దొలుతనె మారు మలయఁగఁ బైపై
       నింకా బుద్దులు చెప్పే వెట్టో నీవు

చ. 2: వొడ్డినందు కెల్లా నాతఁ డోపికతో నుండఁగాను
       అడ్డాలు దుడ్డాలు వచ్చే వప్పటి నీవు
       వడ్డివారె శిగ్గుతోడి వనితను వానిఁ దెచ్చి
       జిడ్డు దేర నవ్వించేవు చీచీ నీవు

చ. 3: బలిమిఁ గాఁగిటఁ గూడి బడలి వాఁ డుండఁగాను
        అలపు సొలపుఁ దేర్చే వప్పటినీవు
        యెలమి శ్రీవెంకటేశు నెదలోనిదాన నేను
        చెలరేఁగించే విన్నిటాఁ జెల్లునె నీవు