పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0312-4 సామంతం సంపుటం: 11-070

పల్లవి: వేసాలవాఁడు గదవే విట్ఠలేశుఁడు
         తా వేసారఁ డెందుకు నైనా విట్ఠలేశుఁడు

చ. 1: వేడుకకాఁడు గదవే విట్ఠలేశుఁడు నాకు
       వీడె మిచ్చీ నింతనోనె విట్ఠలేశుఁడు
       వీడ నాడనీఁడు నన్ను విట్ఠలేశుఁడు అట్టె
       వేడెవట్టీ వలపులు విట్ఠలేశుఁడు

చ. 2: వెన్నెలనవ్వులు నవ్వీ విట్ఠలేశుఁడు యాడో
       విన్నపము లాలకించీ విట్ఠలేశుఁడు
       వెన్నముచ్టిమి విద్యల విట్ఠలేశుఁడు నా
       విన్నఁదన మెల్లా బాపీ విట్ఠలేశుఁడు

చ. 3: విరులు నాపైఁ జల్లీ విట్ఠలేశుఁడు కడు
       విరివికాఁడు గదవే విట్ఠలేశుఁడు
       ఆరిది శ్రీవెంకటాద్రి నందు నిందు నన్నుఁ గూడె
       వెరవరి గదవె యీ విట్ఠలేశుఁడూ