పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0312-3 రాయగౌళ సంపుటం: 11-069

పల్లవి: ఏల వేగిరపడేర యింతలో మీరు
         తాలిమి చూపి యతఁడె దయసేసీఁ గాకా

చ. 1: చనవు లిచ్చినవాఁడు సరవు లేల తప్పునె
       మనసు చూడ వలసి మాయలు గాక
       నను పై యుండేవాఁడు నవ్వ కేల మానునె
       పెనఁగించుకొని తానె బెరసీఁ గాకా

చ. 2: యిచ్చక మాడెటివాఁడు యెగ్గు లేల పట్టునె
       ముచ్చట లాడ వలసి మొరఁగీఁ గాక
       మెచ్చినట్టివాఁడు మేలు మెరయ కేల మానునె
       రచ్చ కెక్కినందాక రాఁపు సేసీఁ గాకా

చ. 3: కలసినయట్టివాఁడు కరఁగ కేలు లండునె
        అలపు దేరినదాఁకా ఆలించీఁ గాక
       యెలమి శ్రీవెంకటేశుఁడిక నేల లోఁచీనె
       చెలఁగి తనబాసలు చెల్లించీఁ గాకా