పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0312-2 మద్యమావతి సంపుటం: 11-068

పల్లవి: మనసు లొక్కటులైతే మరి యేల మఱఁగూ
         పని గలితేఁ జేసే బాయిట నే వేయనూ

చ. 1: నీ కెంత సంతోష మైనా నేడు నా సంతోస మదె
       ఆకడ నీవు నవ్వితే నది నానవ్వె
       లోకలోడిమాఁట గాదు లోను వెలి నొక్కటె
       ఆకె నీడకె తేవయ్య నవుఁగాము లెంచను

చ. 2: నీవు లెస్స వుండితే నేనె లెస్స వుండిన దది
       లావు నీకుఁ గలితే నా లావూ నాదె
       కావర మించుకాఁ గాదు కలగుణము నా కిది
       వావులు చెప్పుకోరయ్య వద్దని నే ననను

చ. 3: నీ మేలె నా మేలు నే నేరుపె నా నేరుపు
       ప్రేమపు నీ ప్రియమె నా ప్రియ మిదివో
       కామించి శ్రీవెంకటేశ గక్కనఁ గూడితి నన్ను
       దోమటి దొడికించితే దూరను నే నాపెను