పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0312-1 శుద్దవసంతం సంపుటం: 11-067

పల్లవి: నీతోడిచుట్టరికాలు నిజ మాయను
         యేతుల నీ జాణతనా లివి నిజ మాయను

చ. 1: వావి గద్దంటాఁ జెప్పి వద్దఁ గూచండి మెల్లనె
       నీవు నవ్విన నవ్వులె నిజ మాయను
       చేవ దేర బుజ్జగించి చెక్కులు నొక్కిన నేఁటి
       కోవరపు నీ చెనకులు నిజ మాయను

చ. 2: గారివించి సందిగొందిఁ గన్నయప్పు డెల్లాను
       నేరుపుల నీ మొక్కులు నిజ మాయను
       వారివీరిచేత నీవు వడిఁబె ట్టింపినయట్టి
       యీరీతినీ పైఁడిలేక లివి నిజ మాయను

చ. 3: కన్నులలె సన్న సేసి కాఁగిలించుకొన్నట్టి
       నిన్న మొన్నటి సుద్దులు నిజ మాయను
       మన్నించి శ్రీవెంకటేశ మరిగి నన్ను నేలితి
       మున్నిటి నీకోరికలు నిజ మాయను