పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0311-6 వరాళి సంపుటం: 11-066

పల్లవి: నీకు నాకు నీపాటి నెయ్యము లెందు గలవె
         కాకుగాఁ జేయ నేలోకో కడ నున్నచెలికి

చ. 1: చనవు సేసుక నీతో సారె సారె నవ్వఁగాను
       యెన లేనియెగ్గు లెంచీ యీపె నాతోను
       వొనర నీ వన్నిటికి నోరుచుక వుండఁగాను
       తన కేల వచ్చెనొకో తమక మీచెలికి

చ. 2: పొందు సేసుక నిన్ను పువ్వులనె వేయఁగాను
       యిందు కే లడ్డాలు వచ్చీ నీపె నాతోను
       సందడి నాచేఁత నీకు సమ్మతులై వుండఁగాను
       అంది వాదు లింతోలొకో అండ నున్నచెలికి

చ. 3: కైవసము సేసుకొని కాఁగిట నిన్ను నించఁగా
       యీవల పంత మే లాడీ నీపె నాతోను
       చేవదేరఁ గూడితిని శ్రీవెంకటేశ నన్ను
       యేవ లేల వచ్చెనొకో యెరవులచెలికి