పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0311-5 పాడి సంపుటం: 11-065

పల్లవి: ఏల వొడఁబరచేవు యింతలోననే నన్ను
         నాలి సేసి నోతోను నవ్వేదాననా

చ. 1: మన సిచ్చి నీవు నాతో మాట లెల్లాఁ జెప్పఁగాను
       విని నవ్వవలెఁ గాక వేసరేనా
       చనవు నీ విచ్చితివి సరి గాదా నను నేను
       తనియఁగ వలె గాక తప్పు లెంచేనా

చ. 2: చేయి పట్టుకొని నీవు చేఁత లెల్లఁ జేయఁగాను
        యీయకొనవలెఁ గాక యీసడించేనా
        ఆయాలు సోఁకించితివి ఆరమరచి చొక్కిలి
        చాయ నేయవలెఁ గాక సాదించేనా

చ. 3: కందువ నుచిని నీవు కాఁగిలింగి కూడఁగాను
       పొందు సేయవలెఁ గాక పొద్దు వుచ్చేనా
       ముందె శ్రీవెంటేశ మోహించితి కలసితి
       చెంది మెచ్చవలెఁ గాక సిగ్గు వడేనా