పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0311-4 లలిత సంపుటం: 11-064

పల్లవి: ముంచుకొంటే వలపులు మొగచాటవును
         మంచముపై జాగరాలు మరి యేలయ్యా

చ. 1: పచ్చనిచిగురువంటి పళ్లెపు మోవిచెలి
       కుచ్చి తేనెలమాటులు కురుసీ నదె
       ఇచ్చకానఁ జెవి యొగ్గి యియ్యకొంటి వన్నియును
       మచ్చిక నాపైఁ జల్లేవు మరి యేలయ్యా

చ. 2: కలువరేకులవంటి కన్నుల వెన్నెలతేట
       పొలితి నేపై దిగఁజోసీ నదె
       పొలసి నిలువుననె పూజ గొంటివి నీ వందు
       మలసి మాకు మొక్కేవు మరి యేలయ్యా

చ. 3: సారె నిమ్మపండ్లవంటి చన్నులవొత్తులఁ జెలి
       కోరిక రతులు నీఫైఁ గులికీ నదె
       కూరిమి శ్రీవెంకటేశ కూడితివి నన్నునిట్టె
       మారు గొసరేవు నీవు మరి యేలయ్యా