పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0311-1 దేవగాంధారి సంపుటం: 11-061

పల్లవి: నీవంటిచిత్తమె నాకు నిలుప రాదా
         చేవ దేర నీ యిచ్చలోఁ జెలగే నయ్యా

చ. 1: సంతస మయనవేళ సారె నవ్వ వచ్చుఁ గాక
       చింతించే వేళా నట్టే చేకూరునా
       పంతపు నీ చేఁతలు నా భావములో నుండఁగాను
       చెంత సరస మాడేవు చెల్లు నయ్య నీకు

చ. 2: చెక్కు నొక్కేటట్టివేళ సేదధేర వచ్చుఁ గాక
       కక్కసించేటట్టివేళ కై కొలుపునా
       వెక్కసపు నీ మాటలు వింటా నే నుండఁగాను
       తొక్కేవు పాదము నేకే తోఁచునయ్య యిట్టివి

చ. 3: మించఁ దనిసినవేళ మే మఱవ వచ్చుఁ గాక
        అంచఁ దమకపువేళ ననువు లౌనా
       యెంచఁగ శ్రీవెంకటేశ యెనసితి విటు నన్ను
       నించితి వేడుక లెల్ల నేర్తు వయ్య నీవు