పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0310-6 ముఖారి సంపుటం: 11-060

పల్లవి: వట్టి సటలకు నింత వాసు లేల
         మెట్టుక వున్నాఁ డతఁడు మేలమాడ రాదా

చ. 1: కూడి వుండినట్టిచోట గోప మేల మంచి
       జాడకు వచ్చియు మరిఁ జల మేల
       వేడుకలలోపల విసు పేల
       వీడె మిచ్చీ నాతఁడు వేగ నందుకోవే

చ. 2: మేర మీర రానీ నీతో మెణ కేల నిన్ను
        గారవించఁగా యాడో కత లేల
        నేరము లేనివెనక నెగు లేలా నిన్ను
        సారెకుఁ జెక్కు నొక్కీని చనవు చేకోవే

చ. 3: మంతన మై యుండఁగాను మరఁగేల
       పంత మిచ్చినందుమీఁద బలిమేల
       యింతలో శ్రీవెంకటేశుఁడిటు గూడెను
       మంతు కెక్కెఁ దొల్లిటిమాట లిఁక నేలే