పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0301-5 ముఖారి సంపుటం: 11-005

పల్లవి: ఆయము లిఁక నిద్దరి కంటుఁ గాక
         చేయివల్ల నుండ నేలె చేఁతల యాతనికి

చ. 1: నిగ్గుల నాతఁ డన్నియు నీకెతోఁ జెప్పఁగాను
       యెగ్గు లేల పట్టేవె యేమే నీవు
       సిగ్గులు నిను రేఁచితె చింతఁ బొరలేదానవు
       దగ్గరి కూచుండ నేలె తమకపాతనివి

చ. 2: నెమ్మది నీమోము చూచి నీవిభుఁడె నవ్వఁగాను
        యెమ్మె లేల సేసేవె యేమే నీవు
        కమ్మ నీకు మొక్కి తేనె కాఁక రేఁగేదానవు
        చెమ్మఁజెమ టార్చ నేలె సేవల నాతనికి

చ. 3: వెకలి శ్రీవెంకటాద్రివిభుఁ డిట్టె కూడఁగాను
        యెకసక్కే లే లాడేవె యేమే నీవు
        వొకటొకటికి నీవు వొరసెటిదానవు
        మొకమిచ్చ లాడ నేలె మొదలె యాతనిని