పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0310-4 కాంబోది సంపుటం: 11-058

పల్లవి: ఓరి నీకు నది యేమి వుండఁబట్టదా
         వారి వీరివలె మాట వడిఁబెట్ట వద్దురా

చ. 1: యీసు రేఁచ నేఁటికి యందరిలోపల నిన్ను
       వాసి దెచ్చుకొని యెంత వంచఁ జూతునో
       రాసి కెక్కితివి తొల్లె రచ్చకూ నెక్కితివి
       బేసబెల్లి నా కోపము పెంచ నిఁక వొద్దురా

చ. 2: కన్నుసన్న లేటికి కడు సిగ్గునను నీ
       మన్ననఁ గూడి యే మని మాటాడుదువో
       వెన్న వేసినవారిని వెస రాత వెయ్య రాదు
       అన్నిటా జాణఁ జేసితి వటు మీర వద్దురా

చ. 3: దొమ్మి సేయ నేఁటికి తొడిఁబడఁ గాఁగిటి మీ
       యిమ్ముల నిన్నలయించి యే ముందునో
       నమ్మించి శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి నీవు
       సమ్మతించిన మీఁదటఁ జలపట్ట వద్దురా