పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0310-3 పాడి సంపుటం: 11-057

పల్లవి: చెప్పఁగల మాట లిఁకఁ జెప్పవయ్య
         ముప్పిరి నిందుకె నేను మోము వంచే నయ్యా

చ. 1: చలివేఁడి సటకాఁడ చదురుల జాణకాఁడ
       మొలకనవ్వులతోను మొక్కె మయ్య
       వలపులయండ గాసీ వాడికవెన్నెల గాసీ
       అలరి యిందుకు వెర గందే మయ్యా

చ. 2: వీదుల జాజరకాఁడ వేసాల వేడుకకాఁడ
       యీదెఁస బాయము కాను కిచ్చే మయ్యా
       తోదోపువసంత మిదే తొక్కుడుసరస మిదే
       ఆదరాన నిందులోనే అలసే మయ్యా

చ. 3: కైకోలు వేగిరకాఁడ కందువల వగకాఁడ
       చేకొని నీచెప్పినట్టు సేసే మయ్యా
       యీకడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
       మేకొని యిన్నిటా నిన్ను మెచ్చే మయ్యా