పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0310-1 రామక్రియ సంపుటం: 11-055

పల్లవి: ఒద్దికతో మము నీవు వూరకె చూడఁగ రాదా
         చద్దికి వేడికి మేమే సంతముల లయ్యేము

చ. 1: యిద్దము నేకతము నాయెదటనె ఆడఁగాను
       వుద్దంగాలు సేయక యెట్టోరుతు నేను
       వొద్ద నీ వుండగా నింతి నొరసితి ననివాదు
       వద్దన్నా మానక యేల వహించుకొనేవు

చ. 2: జాఱక నీవును నాపె సన్నలు సేసుకోఁగాను
       చూఱలుగ నెలువలెఁ జూతు నేను
       మీఱి నీ మంచముమీఁదిమెలుత నంటితి నని
       ఆఱడి నీ వేల ఆపె కడ్డాలు వచ్చేవు

చ. 3: చెక్కు నొక్కి నీవు నది సెలవుల నవ్వుకోఁగా
       తెక్కుల నెట్ల సమ్మతింతు నేను
       చిక్కించి నిన్నుఁ గూడితి శ్రీవెంకటేశ్వర నేను
       కక్కసించితే నాపెకుఁగా నేల మొక్కేవు