పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0309-5 సామంతం సంపుటం: 11-053

పల్లవి: మనవి చెప్పితిని మఱమకుమీ
         కనుఁగొని నామాఁట కడుమకుమీ

చ. 1: యిచ్చక మాడితి వీడనె వుంటవి
       మచ్చిక నా మేలు మఱవకుమీ
       వచ్చి వేకేరొకతె వలపులు చల్లిన
       పచ్చిదేరి మరి పదరకుమీ

చ. 2: సరస మాడితివి చనవు లిచ్చితిని
       మరిగిననాపొందు మానకుమీ
       సరిగా మరొకతె సందులు దూరిన
       తొరలి యపుడు మరి తొలఁచకుమీ

చ. 3: కలసితి విప్పుడు కాఁగిలించితివి
       పొలసి యిట్లనె భోగించుమీ
       యెలమిని శ్రీవెంకటేశ్వర మరొకతె
       పిలిచితేను మరి పెనఁగకుమీ