పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0309-4 కొండమలహరి సంపుటం: 11-052

పల్లవి: కాంతలు పదారువేలు గలవాఁడవు
         యెంత నేనే విటు నీతో నెదురాడే దాననా

చ. 1: నన్ను మన్నించ వలసి నాతో నవ్వితిని గాక
       యెన్నఁగ నావంటివారు యెంత లేదు
       చిన్నఁబోకుండాను నాచెక్కు నొక్కే వింతే కాక
       మిన్నక నేర్పుల నిన్ను మెప్పించేదాననా

చ. 2: నామీద కృప గలిగి ననుపు సేసేవు గాక
       యేమీ నే నిందరిలో నేమి బాఁతి
       దీమసము చెడకుండ తివిరి బుజ్జగించేవు
       కామించి నీమన సంత కరఁగించేదాననా

చ. 3: కడు నన్ను నేలె నని కాఁగిలించు కొంటి గాక
       యెడమని నీరతికి యీడా నేను
       బడినె శ్రీవెంకటేశ పాయకుండా మరపేవు
       కడ లేనిమోహానకు కాణాచిదాననా