పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0309-2 శంకరాభరణం సంపుటం: 11-050

పల్లవి: మెత్తనిమనసుదాన మేలు దాఁచ నే నేర
         కొత్తగా నింతేసికిని గురి యైతి నయ్యా

చ. 1: సిగ్గుపడి నీ వుండఁగ సెలవుల నవ్వు వచ్చీ
       వొగ్గి మాటాడిన నవ్వు లొగి వచ్చీని
       నిగ్గుల నీ రెంటికిని నీ మోవియే సాక్షి
       యెగ్గులు న న్నేల పట్టే వేమి సేతు నయ్యా

చ. 2: తలవంచు కుండినాను దయ నాకుఁ బుట్టీని
        అలసి చూచిన దయ అట్టె పుట్టీని
       మొలచి యీ రెంటికి నీ మోముకళలె సాక్షి
       కులికి మమ్మేల యింత గోర నేనే వయ్యా

చ. 3: వూరకే నీ వుండినాను వొనరీని వలపులు
        ఆరీతి నుండినా ఘన మయ్యీ వలపు
        యీరీతి నీ చక్కఁదన మీ రెంటికిన సాక్షి
        చేరు శ్రీవెంకటేశ మెచ్చి కూడితి వయ్యా