పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0308-6 కేదారగౌళ సంపుటం: 11-048

పల్లవి: అప్పటినాతో నేల అమరమాట లాడేవు
         తిప్పరాని నీవలపు దిష్ట మై వుండఁగను

చ. 1: కప్పురవిడె మిచ్చితే కార మై తోఁచెగా
       చోప్పుగ నీమో మాపె చూడకుండఁగా
       దప్పి దేరే మోముతోడ దగ్గరి నే నుండఁగాను
       చిప్పిల నీ మే నెల్లఁ జెమరించెఁగా

చ. 2: వొగిఁ బన్నీరు చల్లితే వులివెచ్చ దోఁచెఁగా
       నగి నగి ఆపె నీతో నాలి నేయఁగా
       చిగురుచిత్తముతోనె చేత నిన్ను నంటఁగాను
       మొగచా టై రతు లెల్ల మొన చూచెఁగా

చ. 3: గందము వుయ్యగ నీకు కడుఁ బచ్చి దోఁచెఁగా
       ముందరనే ఆపె నీకు మోవి యియ్యఁగా
       యిందులోనె శ్రీవెంకటేశ నే నిన్నుఁ గూడితి
       యిందరిలోనె నాపొందు యితవాయఁగా