పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0308-5 రామక్రియ సంపుటం: 11-047

పల్లవి: ఎక్కినవానికిఁ జూడ యేనుగ గజ్జెయుండు
         వెక్కస మై వెలువ వేవేలు సేసునయ్యా

చ. 1: నన్ను నాడుకోఁ గాని నాయంతటిది లేదు
       వున్నత మయిన నీవూడిగానకు
       పిన్నదాని కింత నీవు పెద్దరికము గట్టితి
       విన్ని నీ పెద్దరికమే యెంచి చూడవయ్యా

చ. 2: వెల్లవిరి సేయఁ గాని వెలితి లేదు నాకు
       వెల్లనె రతుల నిన్ను మెప్పించేయందుకు
       చెల్లబడి సేసితివి జిగి నీ యాఁటదానిని
       కల్ల గా దివెల్లను నీ ఘనతే కాదా

చ. 3: ఆన వెట్టుకోఁ గాని అన్నిటా జాణను నేను
        మెనాన నీపాదాలు మెక్కేయందుకు
       పూని శ్రీవెంకటేశుఁడ భోగించితి విటు నన్ను
       యీ నగవు లీ సంతోస మిది నీదె సుమ్మీ