పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0308-4 సాళంగం సంపుటం: 11-046

పల్లవి: ఇటువంటి తగవులే యెక్కడ చూచినను
         నటనలు బూమిలోన నడచీ నయ్యా

చ. 1: కన్నుల నవ్వినందుకు కాఁతాళించే వేమయ్య
       యెన్ని కెగాఁ దిట్టితే నీ వేమి నేతువో
       వున్నతి నెవ్వరుఁ దమ వొళ్లికల్ల చూచుకోరు
       యిన్నిటాఁ దమ్ము సోఁకితే యెగ్గు పట్టఁ జూతురు

చ. 2: పైకొని మాటాడితేనె పగ చాటే వేమయ్య
       యీకడ చెత నంటితే యేమి సేతువో
       ఆకడఁ దమచేఁతలు అందము లనుకొందురు
       లోకు లవి గాదంటే లోఁచి నా దడుతురు

చ. 3: మొక్కి మొకము చూచితే మొరయుచు జంకించేవు
        యిక్కువ గోర గీరితే నేమి సేతువో
       మక్కువ శ్రీవెంకటేశ మంచివాఁడ వై కూడితి
       తక్కక వా రిది గంటే దంటవు నీ వందురు