పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0307-6 శంకరాభరణం సంపుటం: 11-042

పల్లవి: తక్కినసుద్దులు తడవ మిఁక
         చొక్కులఁ బెట్టుచు సొలయకువయ్యా

చ. 1: చెల్లుగడి గని చేసినచేఁతలు
       చల్లనిమాటల సడి వాసె
       తొల్లిటిదాననె తొడిఁబడఁ జెక్కులు
       యిల్లిదె నొక్కే విదేఁటికయ్యా

చ. 2: పన్నిన మాయలఁ బాసినకాఁకలు
       కన్నుల నవ్వుల కసి దీరె
       చిన్నదాననె చేతికి లోనె
       చన్నులు ముట్టేవు సట లేలయ్యా

చ. 3: అండనె కాఁగిట నలసిన అలయిక
       నిండు మోవితేనెలఁ దేరె
       వెండియు నిటు శ్రీ వెంకటేశ నమ
       మెండుగఁ గూడితి మెచ్చితి నయ్యా