పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0307-5 రామక్రియ సంపుటం: 11-041

పల్లవి: ఇచ్చకము సేయ వచ్చే వే మందును
         బచ్చెన సటకాఁడపు భళరా మెచ్చితిని

చ. 1: చేయి వట్టి పెనఁగేవు చెక్కు నొక్క వచ్చేవు
       యీయెడ నీతో నింక నే మందును
       చాయలకె నవ్వేవు సరసము లాడేవు
       పాయపువగకాఁడవు భళరా మెచ్చితిని

చ. 2: చెలఁగి విడె మిచ్చేవు చెమటలు దుడిచేవు
        యెలయింపు నీచేఁతల కే ముందును
        వలపులు చల్లేవు వద్ద నిట్టె కూచుండేవు
        బలిమి మాయకాఁడవు భళరా మెచ్చితిని

చ. 3: చన్నులపయి నొరగేవు సారె గాఁగిలించేవు
       యేన్నేసి నీ వినయాలు యే ముందును
       యిన్నీటా శ్రీవెంకటేశ యిట్టే నన్నుఁ గూడితిని
       పన్నినగండికాఁడవు భఁళరా మెచ్చితిని