పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0301-3 హిజ్జిజి సంపుటం: 11-003

పల్లవి: నీ వోజగా దిది ని న్నెఱఁగనా
         బూవపుసరసా లేల పూఁచ వచ్చేవూ

చ. 1: అంగనమొగము చూచి అప్పటప్పటికి నాతో
       యెంగిలిమాటలు నేర్చి యే లాడేవు
       సంగడి జాణతనాలు సతు లెల్ల నాడఁగాను
       జంగిలివలపు లేల చల్ల వచ్చేవూ

చ. 2: తరుణి అప్పణగొని తమకించి నాతోడ
       యెరవుల నవ్వులు నీ వేల నవ్వేవు
       వరుస వంతులవారి వాసుల గొంత రేఁచుక
       పొరుగు పొరచు లేల పుయ్య వచ్చేవూ

చ. 3: యింతి కైదండ వట్టుక యిప్పు డిట్టె నామీఁద
       యింతలోనె నీ చేయి యేల వేసేవు
       బంతినె శ్రీవెంకటేశ పై కొని నన్ను గూడితి
       దొంతరరతుల కేల దొమ్మి సేసేవూ