పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0307-2 ఆహిరి సంపుటం: 11-038

పల్లవి: ఇప్పటనుంటియు నేల యెరవు నేయకు వమ్మ
         తప్పు లెల్ల వొప్పులుగా దగఁ జేసేఁ గాని

చ. 1: మచ్చిక నీ మాటతఁడు మన సొగ్గి వినీ నదె
       విచ్చనవిడిని విన్నవించ వమ్మా
       చెచ్చెర యీవేళ నీకుఁ జెల్లి నంతాఁ జేయవమ్మ
       మచ్చరపు మా సుద్దులు మరి చేప్పేఁ గాని

చ. 2: నెలవై నాయకుఁడదే నీవంక చూచీని
       సొలసి చక్కఁదనాలు చూపవమ్మా
       బలి మెంత గలిగినాఁ బచరించవమ్మ యిట్టె
       చలము వెనక నేనె సాదించేగాని

చ. 3: చేయి చాఁచి నీమీఁద జెనకేననీ యాతఁడు
        ఆయ మెరిఁగి సరసా లాడవమ్మా
        యీయెడ శ్రీవెంటేశుఁ డింత సేసి నిన్ను గూడె
        చాయ లేల సన్న లేలసంత మయ్యేఁ గాని