పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0307-1 హిజ్జిజి సంపుటం: 11-037

పల్లవి: ననుబోఁటి చెలు లెల్లా నవ్వరా నిన్ను పతి
         చెనకినదాఁకా గుట్టు నేయంగ వలదా

చ. 1: కనుసన్న సేసితేనె కరఁగితి రమణుఁడు
       తనువు సోఁకితే నెంత తమకింతువో
       యెనసెటివేళనె యిన్నియు నయ్యీఁ గాక
       అనువు నీ ప్రియములు అందరిలో వలెనా

చ. 2: మాటలాడినంతలోనే మరుగుగొంటి వాతఁడు
        నాటఁగ నవ్వితే నెంత నయ మవుదునో
        పాటించి యేకతమందె పచ్చి దేరీఁ గాక నీవు
        వాల మైన సరసాలు వాకిటనె వలెనా

చ. 3: యిక్కువఁ గూడినంతలో యిచ్చితివి చన వెల్ల
        మొక్కితే విభుని కెంత మోహింతువో
        మక్కువ శ్రీవెంకటేశ్వమహిమ లీడేరుఁ గాక
        చెక్కులు నొక్కక తొల్లె సిగ్గు లింత వలెనా