పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0306-5 భైరవి సంపుటం: 11-036

పల్లవి: దైవము సేసిన మాయ తగ నింతేసి కాఁబోయి
         నీవొళ్లికల్ల గాదు నిజమె యీమాఁట

చ. 1: చెప్పేవు సలిగెలు సేసేవు చేఁతలు
       అప్పుడు ఆతఁడు నిన్ను నంటె నంటాను
       కప్పురపుఁబడి తోడికాంత రెల్లా నుండఁగాను
       దెప్పరపువారికి యీ తెక్కు లేల వచ్చును

చ. 2: సారె సారె నవ్వేవు సంగడిఁ గూచుండేవు
       దూరి ని న్నాతఁడు కాలు దొక్కె నంటాను
       చేరినట్టి సేసపాల చెలు లెల్ల నుండఁగాను
       పోరచిసతుల కేల బూటకాలు వచ్చునూ

చ. 3: పెంచేవు పగటులు పెనచేవు వావులు
       ముంచి యొండొకమాటు ముట్టె నంటాను
       యెంచఁగ శ్రీవెంకటేశు నింటిదాననేఁ గూడితి
       పంచల నుండేవారికి బద్దు లేల వచ్చును