పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0306-4 మాళవిగౌళ సంపుటం: 11-035

పల్లవి: వలెఁగా వేసాలు వద్దన్న మానఁడు
         యెలయింపులమాటల నెంత సేసినె

చ. 1: కన్నుల నే మొక్కితేను కాఁక రేల రేఁగీనా
       యిన్నీటాఁ జేతులు మోపి యేల చూపీనే
       వెన్నెలబయట నుంటె వెత రేల రేఁగీనె
       నిన్న నేటనె కతలు నేరిచేఁదాఁ గదవే

చ. 2: పొలసి నే నగితేను పులక లేల పుట్టీనె
       యెలమిఁ జూడు మ నెన లేల పెట్టీనె
       చిలుకలు వలికితే చింత లేల పొడమీనె
       మలక లెల్లఁ బెనచేమాయకాఁడు గదవే

చ. 3: గక్కునఁ గాఁగిలించితె కడుఁ జెమరించ నేలె
       మిక్కిలి గోర నూరిచి మీఁదఁ జిమ్మీనె
       యెక్కువ శ్రీవెంకేశుఁ డెనసె నన్నిటా నన్ను
       చక్కరసరసముల జాణకాఁడు గదవే