పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0306-4 శ్రీరాగం సంపుటం: 11-034

పల్లవి: చలువలు వేండ్లు జరపఁగ నేటికి
         నెల వగు మేలే నించఁగ రాదా

చ. 1: మోహము చెలిపై ముంచినవాఁడవు
       దాహపువిరహము తర వేల
       సాహసి మొదలనె చలముల కోపదు
       యీహల నీవే యెఱుఁగుదు విఁకను

చ. 2: చేసన్నలనే చెనకినవాఁడవు
       వాసులు సతిపై వంచుదురా
       ఆసలనే కడు నలసిన దిందాఁక
       ఆ సుద్దులు మ మ్మడుగకు మిఁకమ

చ. 3: కాఁగిట నంగనఁ గలసినవాఁడవు
       మాఁగినసిగ్గులు మరి యాల
       చేఁగ దేర్చె నిదె శ్రీవెంకటేశ్వర
       వీఁగక ననుపులు విడుమాకు మిఁకనూ