పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0305-6 బౌళి సంపుటం: 11-030

పల్లవి: కన్నవారిదె కాదా కందికుడు మన్నమాట
         యెన్నఁడు జెప్పఁగ విని యెరఁగవో కాక

చ. 1: మక్కువ నీ రమణుఁడు మాయింటికి వచ్చె నంటా
       యెక్కువతోఁ బిలవ నీ వేల వచ్చేవే
       వొక్కరు నోచినసొమ్ము లొకరికి నేల వచ్చు
       పక్కనఁ గైకొన్న వారిభాగ్య మింతే కాక

చ. 2: నాఁడు నీ వడిగేసొమ్ము నాకుఁ దెచ్చి యిచ్చె నంటా
       వాఁడిమి నీ వేల యింత వాదించేవే
       వేఁడయెఱ్ఱిమానిబంక వెఱ్ఱిమాన నేల యంటు
       పోఁడిఁమి జేసినవారిపుణ్య మింతే కాక

చ. 3: నీ వరు సై వుండఁగాను నేఁడు నన్నుఁ గూడెనంటా
       శ్రీవెంకటేశ్వరు నేల చిమ్మి రేఁచేవే
       దేవర వర మిచ్చితే తేరకాఁడు పూజరి
       భావించి తొల్లిటి దానఫల మింతే కాకా