పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0305-4 సౌరాష్ట్రం సంపుటం: 11-028

పల్లవి: ఏల బుద్దులు చెప్పేరె యెందాఁకా నితనికి
         తాలిమి గలితే నేమె తగ వెరిఁగేము

చ. 1: తలఁ పొకచో నుండఁగ తనపైకి దీసుకొని
       బలిమి నేయఁగఁ బోతే పచ్చి దోఁచును
       పెలుచుఁ జిత్త మాతనిఁ బెనఁగి యేమి సేసినా
       చలములు రేఁగుఁ గాని చవి చాలదు

చ. 2: అవ్వల మాటలాడఁగ నందుకెతా మాటాడితె
       పువ్వక పూచినట్టు పుల్లఁబారును
       రవ్వగా నాతని నెంత రతలకుఁ దీసినాను
       నవ్వుఁ బాటై యిందరిలో నారటిలునూ

చ. 3: యెందొ యెదురు చూడఁగా నెదిటికిఁ బోతేను
        సందడి యనుచు మతి సమ్మతించదు
        చెంది యింత చెప్పఁగాను శ్రీవెంకటేశుఁడు గూడె
        మందలించి యివి యల్లా మచ్చికల కెక్కును