పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0305-1 భైరవి సంపుటం: 11-025

పల్లవి: సిగ్గు వడ దప్పటినాచిత్తము నన్నుఁ గొసరీ
         అగ్గలపుచనవులు అప్పిచ్చినవారమా

చ. 1: కరుణించి నీవు నన్నుఁ గాఁగిలించుకొంటి గాక
       వరుసల మాపై నంత వల పున్నదా
       సొరిది మన్నించి నన్నుఁ జూచితి వింతె కాక
       సరవితో నే నీకుఁ జక్కనిదాననా

చ. 2: సేస వెట్టినవాఁడ వై చేకొంటివి గాక నాతోఁ
       బాసి వుండనంత నాపైఁ బరా కున్నదా
       బాస దప్పనందుకుఁగా పక్కన నవ్వితి గాక
       ఆసలఁ బెనఁగ నీకు నందరిలోవారమా

చ. 3: నీవు ధర్మపుణ్యానకు నెల వై కూడితి గాక
       దావతి నానలు వెట్టఁ దగ వున్నదా
       శ్రీవెంకటేశ నన్నుఁ జెనకి మెచ్చితి గాక
       వావులు చెప్పఁగ నీతో వడి మేనవారమా