పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0304-6 మెంచబౌళి సంపుటం: 11-024

పల్లవి: అతఁడెంత నీ వెంత ఔ నవునే
         ఘాతఁ బెద్దరిక మింతాఁ గట్టుకొంటివే

చ. 1: పంతము లన్నియును నీపతిపైనె నెరుపేపు
       పొంతల నిన్నే మని పొగడుదునే
       అంతటి నీకొనగోరు అతనిపై మోపితిని
       దొంతరమొనలు చూప దొడ్డదానవే

చ. 2: చలము లితనిపైనె సాదించ నేరిచితివి
       నిలిచె నింత లాభము నీవద్దనే
       పిలువఁగానె పెనఁగి బీరమునుఁ జూపితిని
       కలికితనము లిందె కైకొంటివే

చ. 3: యేతు లెల్ల శ్రీవెంకటేశ్వరునికె చూపేవు
        నీతి నడచేవారిలో నీవే కదె
        యీతల మామాటలకు నితని నిట్టె కూడితి
        పోతరించి యిన్నిటా నీపుణ్య మాయఁ గదవే